Thursday, September 29, 2011

ALAKA

1.నీవలిగావని తుమ్మెద రెక్కలపై
నే రాసిన లేఖను
జాబిలి లోకానికి చదివి వినిపించేన్తలో
కలువ పరిమళాల చాటింపు వేసింది
ఏకమై పోయిన మన శ్వాస నీలోపుగా

2.ఆమె ఎందుకో అలిగింది
నేనేదో అనేంతలో ఆమె నా పై వాలి
మన ఏకాంతాన్ని వెన్నెల చూసి
లోకమంతా తన కౌగిట సేద దీరితే
నేను మాత్రమే నీ ......
అని అన్నదట .

MOUNAM

1.నీ మౌనం
ఎంత గొప్పది!
పలుకవు
ప్రబంధాలు రాయిస్తావు

2.నీ మౌనం నన్ను తాకితే
నేను పిలువను పలవరించను
నీ మౌనాన్ని నా గుండెలో
నింపుకుని ఊరుకుంటాను
నా చూపులే నిన్ను కరిగిస్తాయని
పలకరిస్తాయని నాకు తెలుసు
తప్పదు నీ మౌనాలు మాటలై
నా పై హిమ వర్షం కురవకపోదు
మన మాటలతో కొత్త మమతా మతమై
లోకాన వెలవకపోదు

3.మౌనాన్ని అభినయించటం
నేర్చిన ఆమె కన్నులు
నాతో అన్ని కవితలు
ఎలా పలికిస్తున్నాయో
ఉసులు చెప్పడమే నేర్చిన నా మనసు
ఎలా అర్ధం చేసుకుందో ..........

AASA

ఆకాశం అద్దమైతే
సముద్రం నీ వదనమైతే
నీ ప్రతి చిరునవ్వు అల
 తీరాన్నిచెరేలోగ 
ఆకాశాన్ని ముద్దాడాలని
నాకెందుకో చిలిపి ఆశ.

Wednesday, September 28, 2011

MINUGURULU

తానోనాడు జాబిలి లో చేయి పెట్టి
గుప్పెడు వెన్నెల బయటకు తీసింది
గాభారా పది నేను ఇదేమిటి అని అడిగా
తను నవ్వుతు ఆ గుప్పెడు పై నా చేతిని పెట్టి
ఈ వెన్నెల తో మన ప్రేమ దీపాలు వెలిగి
చీకటి రాత్రులలో కూడా
లోకం మన ప్రేమ గాంచు గాక అంది
అంతే లెక్కకు మించిన మిణుగురులు.

MACHALA VARUDU

కోనీట అందం చూసుకుని
ఆ లహరుల ఫై ఊయలలుగుతూ
సిగ్గులొలుకు మోముని
మబ్బు మాటున దాచుకుంటూ
వచ్హాడు మచ్చల వరుడు
మెచ్చిన చెలికై

KALUVA KANNULU

కలువలన్ని నీ కన్నులైతే
వెన్నెలనంత వడిసి పట్టన
వేకువ నీవై నడచి వస్తే
వేణువు నేనై పాట పాడనా
పాదం నీదై పయనిస్తుంటే
గమ్యం నేనై స్వాగతించనా

Tuesday, September 27, 2011

KALALU

కలలు ఆకాసంలో కవాతు చేస్తున్నై
మూసిన నీ కను రెప్పలతో కబురు చేయి
మరో ప్రపంచంనీదే నోయ్
మనో వికాసం కలిగే నోయ్

NEE PARICHAYAM

నీ పరిచయం నాకేమి మిగిల్చింది
నా లో లేని నన్ను తప్ప
నీ అజ్ఞాతం నా కేమి మిగిల్చింది
నీకై వెదికే నన్ను తప్ప