దాంపత్యం
రేపటికి వాడిపోయే పూలతో
క్షణానికి ఇంకిపోయే సిరాతో
సరిపెట్టుకుంటుంటే ఆ పెళ్లి తంతు
తానేమో రోజులు లెక్కెట్టుకుంటుందా దాంపత్యం .
*******
ఇరువురు యోధులు
ఆశయాలు వేరైన ఇద్దరు మహా యోధులను
ఎదురు పడనిచ్చి కూడా
రవ్వంతైన అలజడి రేగకుండా
నిదుర దారినొకరిని స్వప్నపు దారినొకరిని
సాగనంపే ధీమంతురాలు నా మనసు.
********
నెలవంక-నిండు జాబిలి
ఎపుడైనా నెలవంకను నిండు జాబిలిని
కలిపి ఒకేసారి చూసావేమిటోయ్ లేదా
ఐతే నిదురలో లీలగా నవ్వుతున్న
ఆ పసివాడి మోమునోసారి చూడు.
********
ఆత్మీయత
అన్వేషణ ఆత్మీయతను పెంచితే
ఆ ఆత్మీయతను
పంచుతుందా అనుభవం.
*******